మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 11:21:15

హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగిన శివ్‌ నాడార్‌

హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగిన శివ్‌ నాడార్‌

ముంబై:   హెచ్‌సీఎల్‌  టెక్నాలజీస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సంస్థ  వ్యవస్ధాపకుడు శివ్‌ నాడార్‌(75) వైదొలిగారు.  ఇకపై కంపెనీలో ఆయన చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ హోదాతో ఎండీగా కొనసాగనున్నారు.  శివ్‌ నాడార్‌ కుమార్తె రోషిణీ(38)  నాడర్‌ మల్హోత్రా  హెచ్‌సీఎల్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఛైర్‌పర్సన్‌గా రోషిణీ నియామకం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. 

'కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు రోషిణీని ఛైర్‌పర్సన్‌గా నియమించారు. శివ్‌ నాడార్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో అతని స్థానంలో రోహిణికి బాధ్యతలు అప్పగించామని' కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.   అజయ్‌ చౌదరీ, అర్జున్‌ మల్హోత్రా సహా మరో ఐదుగురితో  కలిసి నాడర్‌ హెచ్‌సీఎల్‌ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఫోర్బ్స్  ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రోషిణి 54వ స్థానంలో నిలిచారు.


logo