శనివారం 28 నవంబర్ 2020
Business - Nov 22, 2020 , 01:25:00

పోటీతో వ్యాపారానికి పదును

పోటీతో వ్యాపారానికి పదును

  • ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి

హైదరాబాద్‌: పోటీ చట్టాలు (కాంపిటీషన్‌ లాస్‌), మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్‌).. ఆవిష్కరణలను ప్రోత్సహించి మానవాళి పురోగతికి దోహదం చేస్తాయని రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘ఐపీఆర్‌ బ్రిడ్జ్‌ అండ్‌ కాంపిటీషన్‌ గ్రూమ్‌' పేరుతో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రచించిన ఈ పుస్తకాన్ని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కే పద్మనాభయ్య శనివారం ఆవిష్కరించారు. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ అశోక్‌ కుమార్‌ గుప్తా, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, తదితరులు వర్చువల్‌గా పాల్గొన్న ఈ కార్యక్రమంలో దువ్వూరి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. పోటీ ఉంటే వ్యాపారం మరింత పదునెక్కి అది మరింత అభివృద్ధి చెందుతుందని, ఉత్పత్తులను మెరుగుపరిచే ఆవిష్కరణలకు వ్యాపారం దోహదం చేస్తుందని తెలిపారు. పోటీ చట్టాలు, మేధో సంపత్తి హక్కుల మధ్య ‘బిగువు’ ఉన్నప్పటికీ కొనుగోళ్లను ప్రోత్సహించి విజ్ఞానాన్ని విస్తరింపజేయాలన్న ఉమ్మడి లక్ష్యం వైపు అవి అడుగులు వేస్తాయని చెప్పారు. డిజిటల్‌ టెక్నాలజీల నేపథ్యంలో పోటీ చట్టాలు, మేధో సంపత్తి హక్కుల మధ్య బిగువును సమన్వయం చేయడం విధానపరంగా ప్రభుత్వానికి చాలా సంక్లిష్టమైన సవాలని దువ్వూరి పేర్కొన్నారు.