శుక్రవారం 05 జూన్ 2020
Business - May 24, 2020 , 00:12:24

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం

  • కాంటాక్ట్‌ లెస్‌ సేవలు .. 
  • విమానాశ్రయ సీఈవో ఎస్‌జీకే కిషోర్‌

సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తన సేవల పునరుద్ధరణకు సిద్ధమైంది. కొవిడ్‌-19 సమయంలో దేశీయ సర్వీసులు ప్రారంభిస్తున్నందున ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లు జీఎంఆర్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ విమానాశ్రయ సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు. శనివారం ఎయిర్‌పోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 24 నుండి డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ , కమర్షియల్‌ ఆపరేషన్స్‌ను నిలిపివేశామని, రెండు నెలల అనంతరం మళ్లీ దేశీయ ప్రయాణాలకు పౌర విమానయాన శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తామని అన్నారు. మొదటి విడుతలో 30 శాతం, రెండో విడుతలో మరో 30 శాతం ఆపరేషన్స్‌ ప్రారంభించి అతి త్వరలో మొత్తం కార్యకలపాలను నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ నుండి దేశంలోని 36 ప్రాంతాలకు సర్వీసులు నడిపిస్తామన్నారు. 

విమానం ఎక్కే ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్కానింగ్‌, ఆటోమేటిక్‌  హ్యాండ్‌ శానిటైజర్లు, భౌతిక దూరం పాటించే గుర్తులు, దూరంగా కూర్చునేందుకు ఏర్పాట్లు, ఒకరికి మరొకరు తాకకుండా ఎంట్రీగేట్లు, చెకిన్‌ ఐలాండ్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆహారం తినడాన్ని అనుమతించబోవట్లేదని, సీట్ల మధ్య దూరం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ప్రత్యేక యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే విమానాశ్రయంలో ఆహారం సిద్ధంగా ఉంచుతామన్నారు. కాగా, వందే భారత్‌ విమానాల ద్వారా 3 వేల మంది ప్రయాణికులను ఇతర దేశాల నుండి తీసుకువచ్చినట్లు తెలిపారు. విమానాశ్రయ సిబ్బంది ఎవరూ కరోనా బారిన పడలేదని ప్రకటించారు.


ఎయిర్‌పోర్ట్‌లో జాగ్రత్తలు

  • క్యాబ్‌లో వచ్చే వారికి ప్రత్యేకంగా శానిటైజేషన్‌
  • ప్రతి ప్రయాణికుడికి మాస్క్‌, శానిటైజర్‌, గ్లౌజులతో కూడిన కిట్‌
  • 10 ఏండ్లలోపు పిల్లలు, గర్భిణులు, 60 ఏండ్ల వారికి ప్రత్యేక అనుమతులు ఉంటేనే లోనికి
  • అందుబాటులో సెల్ఫ్‌ చెకిన్‌, సెల్ఫ్‌ బ్యాగ్‌ ట్యాగ్‌, స్కాన్‌ అండ్‌ ఫ్లై వంటి సేవలు
  • ఒక హ్యాండ్‌ బ్యాగేజీ, ఒక చెకిన్‌ బ్యాగేజీకి మాత్రమే అనుమతి
  • బ్యాగేజీ, ట్రాలీ సిస్టమ్‌ల తనిఖీలకు డిస్‌ఇన్‌స్పెక్షన్‌ వ్యవస్థ
  • కియోస్క్‌ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌చేసి మొబైల్‌ ఫోన్‌ ద్వారా సెల్ఫ్‌ చెకిన్‌కు అవకాశం


logo