Gold Imports | బంగారం అంటే ఎవరికైనా మక్కువే.. ఇక మగువల సంగతి చెప్పనక్కర్లేదు. పండుగల సీజన్లో చాన్స్ ఉంటే బంగారం కొనడానికే మహిళలు ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రస్తుతం పండుగల సీజన్ నేపథ్యంలో గత నెలలో భారీగా బంగారం దిగుమతులు జరిగాయి. గతేడాదితో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు 658 శాతం పెరిగాయి. దాదాపు ఆరు నెలలుగా స్థానికంగా ధరల్లో సర్దుబాటు చోటు చేసుకుందని, పండుగల సీజన్లో బంగారం కొనుగోళ్లు పెరిగాయని జ్యువెల్లరీ వ్యాపారులు అంటున్నారు. గతేడాది ఆగస్టులో ఔన్స్ బంగారం ధర 2072 డాలర్లకు చేరుకుని ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. దాంతో పోలిస్తే ప్రస్తుతం 15 శాతం ధరలు తగ్గాయి.
గత నెలలో 91 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది. గతేడాది ఇది కేవలం 12 టన్నులకు పరిమితం అయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డాలర్లరూపంలో ఏడాది క్రితం 601 మిలియన్ల డాలర్ల నుంచి 510 కోట్ల డాలర్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 170 శాతంతో 288 టన్నులకు చేరుకున్నదని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సర్దుబాటుకు గురయ్యాయి. మరోవైపు రూపాయి విలువ బలోపేతమైంది. ఈ రెండు అంశాలు స్థానిక మార్కెట్లో గణనీయ స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయని ముంబై ఆధారిత జ్యువెల్లరీ డీలర్ వ్యాఖ్యానించారు. గత వారం పది గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర రూ.45,479 పలుకుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెలలో బంగారం దిగుమతులు 100 టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఫోన్13కు చిప్‌ల కొరత.. యాపిల్ షేర్లు పతనం
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!