మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 06, 2021 , 02:00:25

సెన్సెక్స్‌ @ 51000

సెన్సెక్స్‌ @ 51000

  • 117 పాయింట్లు లాభపడిన సూచీ

ముంబై, ఫిబ్రవరి 5: వరుసగా ఐదోరోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వుబ్యాంక్‌ నిర్ణయం తీసుకున్నప్పటికీ, వచ్చే ఏడాది వృద్ధి రెండంకెలకు చేరుకోనుందంటున్న వార్త మదుపరులను కొనుగోళ్ళ వైపు మళ్లించాయి. ప్రారంభంలోనే 51 వేల మార్క్‌ను అధిగమించిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ ఒక దశలో 51,073 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. వారాంతం ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 117.34 పాయింట్లు లాభపడి రికార్డు స్థాయి 50,731.63 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 15 వేల మార్క్‌ను అధిగమించింది. చివరకు మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో 28.60 పాయింట్లు అందుకొని 14,924.25 వద్ద నిలిచింది. 

ఎస్బీఐ లాభాల జోరు

విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఎస్బీఐ షేరు ధర భారీగా పుంజుకుంటున్నది. వరుసగా రెండో రోజు షేరు ధర 11 శాతానికి పైగా లాభపడింది. వరుసగా రెండు రోజుల్లో 17 శాతం లాభపడినట్లు అయింది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.51 వేల కోట్లు పెరిగి రూ.3,50,781.86 కోట్లుగా ఉన్నది. కొటక్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో, నెస్లె, రిలయన్స్‌లు లాభాల్లో ముగిశాయి. కానీ యాక్సిస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీలు నష్టపోయాయి. 

VIDEOS

logo