గురువారం 28 మే 2020
Business - May 18, 2020 , 10:42:07

700 పాయింట్లకుపైగా పతనమైన సెన్సెక్స్‌

700 పాయింట్లకుపైగా పతనమైన సెన్సెక్స్‌

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా పడిపోవడంతో కీలకమైన భారతీయ ఈక్విటీ సూచీలు సోమవారం పడిపోయాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) లోని నిఫ్టీ 50 కూడా నిర్ధిష్ట మార్కు 9,000 పాంయింట్ల కంటే 200 పాయింట్ల దిగువకు పైగా పడిపోయింది. మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్‌ పొడిగించడం, ఆర్థిక ప్యాకేజీపై అనేక కోణాల్లో నిరాశ చెందడం ఈ పతనానికి కారణమని చెప్పవచ్చు. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 30,359.56 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు 31,097.73 వద్ద నుంచి 738.17 పాయింట్లు అంటే 2.37 శాతం తగ్గింది. 31,248.26 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్‌ ఇప్పటివరకు ఇంట్రా-డే గరిష్టంగా 31,248.26, కనిష్టంగా 30,265.67 పాయింట్లుగా ఉంది. నిఫ్టీ 50 ప్రస్తుతం 8,916.70 వద్ద ట్రేడవుతోంది, అంతకుముందు ముగింపుతో పోలిస్తే 220.15 పాయింట్లు అంటే 2.41 శాతం తగ్గింది.


logo