శనివారం 30 మే 2020
Business - May 15, 2020 , 11:09:17

స్వల్ప నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

స్వల్ప నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

ముంబయి: ఉదయం స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం కాగానే తొలుత లాభాలతో ప్రారంభమై అనంతరం నష్టాల్లోకి వెళ్లిపోయింది. సెన్సెక్స్‌ 36 పాయింట్ల నష్టంతో 31,086 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 9,130 వద్ద కొనసాగుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.81 వద్ద కొనసాగుతుంది. అమెరికా మార్కెట్లు నిన్న లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక శాఖ ప్రకటించిన ఉద్దీపణల మంత్రి మార్కెట్లపై ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఓఎన్‌జీసీ, బ్రిటానియా లిమిటెడ్‌, హిందాల్కో, ఇండస్ట్రీస్‌, టాటాస్టీల్‌, భారత్‌ పెట్రోలియం, టైలాన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం షేర్లు లాభాలతో పయనిస్తుండగా, మహింద్రా అండ్‌ మహీంద్రా, ఐషర్‌ మోటర్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌సీఎల్‌, ఐటీసీ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. 


logo