భారీ నష్టాల్లో మార్కెట్లు

- సెన్సెక్స్ 394, నిఫ్టీ 96 పాయింట్లు పతనం
ముంబై, ఆగస్టు 20: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. గత మూడు రోజులుగా లాభాల్లో కొనసాగిన సూచీలు.. మదుపరుల అమ్మకాల ఒత్తిడితో నష్టపోక తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 394.40 పాయింట్లు లేదా 1.02 శాతం క్షీణించి 38,220.39 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 96.20 పాయింట్లు లేదా 0.84 శాతం దిగజారి 11,312.20 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడం, కరోనా నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. హెచ్డీఎఫ్సీ షేర్ విలువ అత్యధికంగా 2.35 శాతం దిగజారింది. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లూ నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా సూచీ లూ పడిపోగా, ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ఒక్కరోజే 20 పైసలు క్షీణించింది. కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌సహా ఆసియా దేశాల కరెన్సీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలోనే 75.02కు రూపాయి విలువ పరిమితమైంది.
తాజావార్తలు
- పార్లమెంట్ క్యాంటీన్లో నో సబ్సిడీ.. హైదరాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?
- సలార్ కథానాయికని ప్రకటించిన చిత్ర బృందం
- తమిళనాడులో దొంగల బీభత్సం : 17 కేజీల బంగారం చోరీ
- రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
- నేడు లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- పెళ్లాం కదా అని కొడితే కటకటాలే...
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు