బుధవారం 28 అక్టోబర్ 2020
Business - Aug 24, 2020 , 17:18:05

ఆరు నెలల గరిష్ఠానికి స్టాక్ మార్కెట్లు

ఆరు నెలల గరిష్ఠానికి స్టాక్ మార్కెట్లు

ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకుల ర్యాలీ కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దూకుడు చూపాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 సూచీ 0.83 శాతం పెరిగి 11,466.45 వద్ద ముగియగా, బెంచ్‌మార్క్ ఎస్ అండ్ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 38,799.08 వద్దకు చేరుకుంది. గ్లోబల్ ఫుడ్ మార్కెట్లు రెండవ వరుస సెషన్‌లో లాభపడ్డాయి. 

వారాంతాన సైతం నష్టాలను పూడ్చుకుంటూ మార్కెట్లు ఇదే స్థాయిలో పుంజుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం అమెరికా ఇండెక్సులు సరికొత్త గరిష్ఠాలకు చేరగా.. ఆసియాలోనూ మార్కెట్లు లాభపడటం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. తొలి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సెన్సెక్స్‌  ఒక దశలో 38,895 పాయింట్లకు చేరింది. తద్వారా 39,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. నిఫ్టీ కూడా 11,497 వద్ద గరిష్ఠాన్నీ, 11,411 దిగువన కనిష్ఠాన్నీ తాకింది. 

18 పైసలు పెరిగిన రూపాయి

అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ 0.7 శాతం పెరిగి 74.31 వద్దకు చేరుకున్నది. ఇది మార్చి 18 నుంచి ఉత్తమ స్థాయి. అంతకుముందు 75.02 వద్ద ముగిసిన రూపాయి.. పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలం, డాలరు బలహీన నేపథ్యంలో లాభాల్లో ముగిసింది. దేశీయ ఈక్విటీలలో భారీగా కొనుగోళ్లతో  దేశీయ కరెన్సీ శుక్రవారం  లాభాలతో ముగిసింది.


logo