గురువారం 28 మే 2020
Business - May 11, 2020 , 10:21:04

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు

ముంబై: ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే లాభాల‌తో కొన‌సాగాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగి 32182 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 148 పాయింట్ల లాభ‌ప‌డి 9400 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. సెన్సెక్స్ ప్యాక్‌లో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ మూడు శాతంకు పైగా పెరిగి అగ్ర‌స్థానంలో నిలిచింది. త‌రువాతి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్‌, మారుతి, బ‌జాజ్ ఆటో, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, ఐటీసీ ఉన్నాయి. నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. షాంఘై, హాకాంగ్‌, టోక్యో, సియోల్‌, బోర్సెస్ దేశాల‌కు చెందిన కంపెనీల ష‌ర్లు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి.  అంత‌ర్జాతీయ చ‌మురు బెంచ్‌మార్క్ ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ బ్యారెల్ ధ‌ర 1.16 శాతం పెరిగి 30.61 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌వుతుంది. దేశంలో కోవిడ్‌-19 కార‌ణంగా మర‌ణించిన వారి సంఖ్య 2,206కు చేరుకోగా, పాజిటివ్ కేసుల సంఖ్య 67,152కు చేరుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ బారిన ప‌డిన వారి సంఖ్య 41 ల‌క్ష‌ల‌కు చేరుకోగా, వ‌ర‌ల్డ్ వైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య 2.82 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. 


logo