మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 01, 2021 , 12:57:20

బడ్జెట్‌ 2021 : స్టాక్‌మార్కెట్‌ ర్యాలీ

బడ్జెట్‌ 2021 : స్టాక్‌మార్కెట్‌ ర్యాలీ

ముంబై : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలు స్టాక్‌ మార్కెట్‌ను మెప్పించాయి. కొనుగోళ్ల వెల్లువతో సెన్సెక్స్‌, నిఫ్టీ పరుగులు పెట్టాయి. .మౌలిక రంగంలో భారీ వ్యయం, పెట్టుబడుల ఉపసంహరణ, సంస్కరణలపై దూకుడు వంటి నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.

ఇక అందుబాటు గృహాలపై పన్ను విరామం, పలు ప్రోత్సాహకాలకు మార్కెట్‌ సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2314 పాయింట్లు లాభపడి 48,600 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 646 పాయింట్ల లాభంతో పాయింట్ల వద్ద 14281 ముగిసింది.

VIDEOS

logo