Business
- Jan 02, 2021 , 01:52:34
VIDEOS
రికార్డులతో బోణీ

- 48 వేలకు చేరువైన సెన్సెక్స్
- 14 వేల పైకి నిఫ్టీ
ముంబై, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజు స్టాక్ మార్కెట్లు కదం తొక్కాయి. ఐటీ, వాహన, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల అండతో దేశీయ సూచీలు రికార్డు స్థాయికి దూసుకెళ్లాయి. వరుసగా ఎనిమిది రోజులుగా లాభపడుతున్న సూచీలు వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 117.65 పాయింట్లు లాభపడి 47,868.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ తొలిసారిగా 14 వేల పాయింట్లపైకి చేరుకున్నది. చివరకు 36.75 పాయింట్లు అందుకొని 14,018 వద్ద ముగిసింది. వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోవడం, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదుకావడంతో సూచీలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఐటీసీ అత్యధికంగా 2.32% లాభపడ్డాయి. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల షేర్లు 2% వరకు నష్టపోయాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 895, నిఫ్టీ 269 పాయింట్లు వృద్ధి చెందాయి.
తాజావార్తలు
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్
- రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా
- గాలి సంపత్ నుండి 'పాప ఓ పాప..' వీడియో సాంగ్ విడుదల
- పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం
MOST READ
TRENDING