మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 25, 2020 , 00:45:34

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబై, జనవరి 24: బ్యాంకింగ్‌ షేర్ల దన్నుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 226.79 పాయింట్లు పుంజుకుని 41,613.19 వద్ద ముగియగా, నిఫ్టీ 67.90 పాయింట్లు అందుకుని 12,248.25 వద్ద స్థిరపడింది. వచ్చే వారం బడ్జెట్‌ ఉన్న క్రమంలో బ్యాంకింగ్‌ షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్సిస్‌, కొటక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 2 శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల 17తో ముగిసిన వారంలో 943 మిలియన్‌ డాలర్లు పెరిగి మొత్తం 462.16 బిలియన్‌ డాలర్ల ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకొన్నట్టు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.



logo
>>>>>>