శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Sep 19, 2020 , 01:15:25

రెండో రోజూ అదే తీరు..నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

రెండో రోజూ అదే తీరు..నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. బెంచ్‌మార్క్‌ సూచీ వరుసగా రెండోరోజు స్పల్పంగా నష్టపోయింది.ఇంట్రాడేలో 550 పాయింట్ల స్థాయిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ చివరకు 134 పాయింట్ల నష్టంతో 38,846 వద్ద నిలిచింది. నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 11,505 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు టాప్‌ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌, మారుతి, టైటాన్‌, ఎస్బీఐ, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటాస్టీల్‌లు నష్టపోయాయి.  

ఫార్మా రంగ షేర్ల జోరు

ఫార్మా రంగ షేర్లు మాత్రం దూసుకుపోతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లాతోపాటు ఇతర సంస్థల షేర్లు మదుపరులను ఆకట్టుకుంటున్నాయి. అమెరికాకు చెందిన బ్రిస్టోల్‌తో లిటిగేషన్‌ కేసును సెటిల్‌ చేసుకున్నట్లు రెడ్డీస్‌ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు ధర 10.36 శాతం లాభంతో రూ.5,326 వద్ద నిలిచింది.


logo