శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 09, 2021 , 00:18:35

మార్కెట్లు జిగేల్‌

మార్కెట్లు జిగేల్‌

  • రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీలు
  • సెన్సెక్స్‌ 689, నిఫ్టీ 210 పాయింట్లు వృద్ధి

ముంబై, జనవరి 8: దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల పరంపర కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు నష్టపోయిన సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో భారీగా పుంజుకున్నాయి. ఐటీ రంగ షేర్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు కూడా తోడవడంతో సూచీలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 689.19 పాయింట్లు(1.43 శాతం) అందుకొని 48,782.51కి చేరుకున్నది. ఇంట్రాడేలో ఆల్‌టైం హై 48,854.34 గరిష్ఠ స్థాయిని తాకింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 209.90 పాయింట్లు(1.48 శాతం) పెరిగి గరిష్ఠ స్థాయి 14,347.25కి చేరుకున్నది.దీంతో బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.195.66 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ షేర్‌ విలువ 5.94 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీలు లాభపడ్డాయి. మరోవైపు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌లు రెండు శాతం వరకు కోల్పోయాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్‌ 913.53 పాయింట్లు(1.90 శాతం), నిఫ్టీ 328.75 పాయింట్లు(2.34 శాతం) పెరిగాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, ఆటో, టెక్‌, యుటిలిటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు మూడు శాతానికి పైగా బలపడగా..మెటల్‌, టెలికం దిగువకు పడిపోయాయి. VIDEOS

logo