సోమవారం 08 మార్చి 2021
Business - Feb 16, 2021 , 10:28:23

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు భారీగా వృద్ధి చెందాయి.  దేశీయ ఈక్విటీ మార్కెట్ షేర్లు ఆరంభం నుంచే లాభాలతో ప్రారంభమయ్యాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 52,400కు చేరుకోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలిసారి 15,400 మార్క్‌ చేరుకున్నది. రెండు ఇండెక్స్‌లు కూడా తొలిసారి ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌ మరోసారి 52వేల మార్కును దాటింది. 

VIDEOS

logo