Stocks New Record | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డు లబ్ధి గడించాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సంస్థలు, ఐటీ, మెటల్ స్క్రిప్ట్స్ మద్దతుతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ మరో రికార్డు నెలకొల్పింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 61,963 పాయింట్లకు దూసుకెళ్లింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 61,765 పాయింట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఆల్‌టైం రికార్డును తాకింది. తిరిగి ట్రేడింగ్ ముగిసే సయమానికి 18,450 పాయింట్ల వద్ద నిలిచింది. ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 9 పైసలు పడిపోయి.. డాలర్ విలువ 75.35 రూపాయలకు చేరుకున్నది.
వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఏడో రోజు లాభాలతో ముగిసాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అద్భుతమైన లాభాలు గడించాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా.. రెండు ఇండెక్స్‌ల్లోనూ లబ్ధి పొందాయి.
ఇక బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో 17 స్క్రిప్ట్‌లు పైపైకి దూసుకెళ్లగా, 13 నష్టపోయాయి. ఇన్వెస్టర్ల మద్దతు పెరగడంతో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టీసీఎస్ స్క్రిప్ట్‌లకు భారీ డిమాండ్ నెలకొంది.