బుధవారం 03 జూన్ 2020
Business - Apr 17, 2020 , 08:13:17

నష్టాల నుంచి లాభాల్లోకి

నష్టాల  నుంచి  లాభాల్లోకి

  • 223  పాయింట్లు లాభపడ్డ  సెన్సెక్స్‌

ముంబై, ఏప్రిల్‌ 16: వరుసగా రెండు రోజులపాటు నష్టాల్లో ట్రేడైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చా యి. కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలతో ఐటీ రంగ షేర్లు కుదేలైనప్పటికీ సూచీలు లాభాల్లోకి రావడం విశేషం. కరోనా వైరస్‌తో భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే అంచనావేయడం లేదని విప్రో తాజాగా ప్రకటించడంతో ప్రారంభంలో నష్టాల్లోకి జారుకున్న సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో తిరిగి కోలుకున్నాయి. ఇంట్రాడేలో 30,800 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 222.80 పాయింట్లు లాభపడి 30, 602.61 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 67.50 పాయింట్లు అందుకొని 8,992. 80కి చేరుకున్నది. 

ఒత్తిడిలో ఐటీ రంగ షేర్లు

ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఐటీ రంగానికి చెందిన కంపెనీల షేర్లలో క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. ప్రారంభంలో ఆరు శాతం పడిపోయిన విప్రో షేరు చివరకు ఒక్క శాతం లాభపడింది. 


logo