సెన్సెక్స్ ఢమాల్

కొంపముంచిన మదుపరుల లాభాల స్వీకరణ.. అమ్మకాల ఒత్తిడిలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు
ఒక్కరోజే 746 పాయింట్లు పతనం.. 218 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ముంబై, జనవరి 22: మదుపరుల లాభాల స్వీకరణ స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభమైన దగ్గర్నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్ 746.22 పాయింట్లు లేదా 1.50 శాతం క్షీణించి 48,878.54 వద్ద స్థిరపడింది. ఒక్కరోజే ఈ స్థాయిలో పడిపోవడం గడిచిన నెల రోజుల్లో ఇదే కావడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 218.45 పాయింట్లు లేదా 1.50 శాతం పతనమై 14,400 మార్కుకు దిగువన 14,371.90 వద్ద నిలిచింది. గురువారం సైతం మార్కెట్లను మదుపరుల లాభాల స్వీకరణే నష్టాల్లోకి నెట్టింది. ఆరంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ తొలిసారిగా 50వేల మార్కును చేరినా.. చివరకు నష్టాలతో ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేకపోయింది. మరుసటి రోజు కూడా ఇదే తీరు చోటుచేసుకోగా.. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 156.13 పాయింట్లు లేదా 0.31 శాతం, నిఫ్టీ 61.8 పాయింట్లు లేదా 0.42 శాతం దిగజారాయి. అయితే స్టాక్ మార్కెట్ రికార్డుల్లో దూసుకుపోతున్న వేళ.. లాభాలను ఒడిసి పట్టుకోవడానికే మదుపరులు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్లకూ ఆదరణ కరువైంది.
తాజావార్తలు
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
- కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్రస్నానం