బుధవారం 03 జూన్ 2020
Business - May 23, 2020 , 00:33:05

మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

  • మార్కెట్లకు రుచించని ఆర్బీఐ నిర్ణయాలు
  • సెన్సెక్స్‌ 260, నిఫ్టీ 67 పాయింట్లు క్షీణత

ముంబై, మే 22: స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్‌ తీసుకున్న నిర్ణ యం మార్కెట్‌ వర్గాలకు రుచించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ప్రతికూలానికి పడిపోయే ప్రమాదం ఉన్నదన్న సెంట్రల్‌ బ్యాంక్‌ హెచ్చరికలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. దీనికి తోడు మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో అలజడి సృష్టించింది. ఫలితంగా స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆర్బీఐ ప్రకటన వెలువడగానే భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఒక దశలో 450 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ వారాంతం ట్రేడింగ్‌ ముగిసేసరికి 260.31 పాయింట్లు పతనం చెంది 30,672.59 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 67 పాయింట్లు క్షీణించి 9,039.25 వద్ద నిలిచింది.


logo