మళ్లీ 44,000 మార్కును క్రాస్ చేసిన సెన్సెక్స్ ...

ముంబై: బుధవారం భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాటలో ఉన్నప్పటికీ, మధ్యాహ్నం గం.1 నుంచి లాభాల్లోకి వచ్చాయి. ఆ తర్వాత మార్కెట్లు అదే స్థాయిని కొనసాగించాయి. అంతకంతకూ పెరిగి 400కు పైకి చేరుకున్నాయి. సెన్సెక్స్ 431.64 పాయింట్లు అంటే 0.98శాతం లాభపడి 44,259.74 పాయింట్లకు, నిఫ్టీ 128.60 పాయింట్లు అంటే1.00 శాతం లాభపడి 12,987 పాయింట్లకు ఎగిసింది.
1726 షేర్లు లాభాల్లో, 986 షేర్లు నష్టాల్లో ముగియగా, 179 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ మళ్లీ 44,000 మార్కును క్రాస్ చేసింది. అయితే నిఫ్టీ 13వేల పాయింట్లకు మరో 13 పాయింట్ల దూరంలో ముగిసింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 19,196 పాయింట్ల వద్ద ముగిసింది. 40 స్టాక్స్‌కు పైగా లాభాల్లో ముగిశాయి. సిమన్స్ స్టాక్ 10 నెలల గరిష్టాన్ని తాకింది. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ 6.19 శాతం, టాటా స్టీల్ 5.02 శాతం, గ్రాసీమ్ 4.07 శాతం, హిండాల్కో 2.89 శాతం, శ్రీసిమెంట్స్ 2.88 శాతం లాభాల్లో ముగిశాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి