సెన్సెక్స్ @ 47 వేలు

ముంబై: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎగబడి కొనుగోళ్లు చేయడంతో సూచీలు మరో ఆల్‌టైం హైకి చేరాయి. ఇంట్రాడేలో తొలిసారి 47 వేల మార్క్‌ను దాటిన సూచీ చివర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఇంతటి భారీ లాభాలను నిలుపుకోలేక పోయింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడి 46,960.69 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 19.85 పాయింట్లు ఎగబాకి 13,760.55 వద్ద స్థిరపడింది. ఈ రెండు సూచీలకు ఇదే చారిత్రక గరిష్ఠ స్థాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 861.68 పాయింట్లు (1.86 శాతం), నిఫ్టీ 246.70 పాయింట్లు (1.82 శాతం) లాభపడ్డాయి.
ఐటీ స్టాకులకు అనూహ్య స్పందన
ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ రంగ సంస్థలు అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదన్న అంచనాలతో ఈ రంగ షేర్లు మిలమిలమెరిశాయి. ఇన్ఫోసిస్ 2.64 శాతం లాభపడగా, విప్రో 1.89 శాతం, మైండ్‌ట్రీ 1.58 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 1.32 శాతం, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. వీటితోపాటు బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్స్‌లు ఆకట్టుకున్నాయి. మరోవైపు, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి, బజాజ్ ఫిన్, భారతీ ఎయిర్‌టెల్‌లు మాత్రం మూడు శాతం వరకు కోల్పోయాయి.
తాజావార్తలు
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
- 70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!
- చెన్నైలో వ్యాక్సిన్ తీసుకున్న వెంకయ్యనాయుడు
- చాడ్విక్ బోస్మాన్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు