సోమవారం 01 జూన్ 2020
Business - May 09, 2020 , 23:57:26

ఏడాదంతా జీతాల్లో కోతే

ఏడాదంతా జీతాల్లో కోతే

న్యూఢిల్లీ: సీనియర్‌ ఉద్యోగులకు ఇండి గో ఎయిర్‌లైన్స్‌ షాకిచ్చింది. దేశీయ విమానయాన రంగంపై కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మొత్తంగా జీతాల్లో 25 శాతం వరకు కోత ఉంటుందని శనివారం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలోనే మళ్లీ పూర్తి వేతనాల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. మే, జూన్‌, జూలై నెలలకుగాను 5 నుంచి 25 శాతం వరకు జీతాల్లో కోత పెడుతున్నట్లు సంస్థ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది మార్చిదాకా పొడిగిస్తున్నట్లు తాజాగా తెలిపింది.   


logo