సోమవారం 30 మార్చి 2020
Business - Feb 17, 2020 , 23:53:16

కార్వీ లాంటి మోసాలకు చెక్‌

కార్వీ లాంటి మోసాలకు చెక్‌
  • త్వరలో నూతన మార్గదర్శకాలు: సెబీ చైర్మన్‌ త్యాగీ

ముంబై, ఫిబ్రవరి 17: కార్వీ బ్రోకింగ్‌ లాంటి మోసాలకు చెక్‌ పెట్టడానికి త్వరలో నూతన మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నట్లు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగీ తెలిపారు. కార్వీ బ్రోకింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(కూఎస్‌బీఎల్‌) మాదిరిగా ఇతర సంస్థలు  క్లయింట్లను మోసం చేసి తమ సొంత అవసరాలకు వాడుకుంటున్న సంస్థలపై నిఘా పెంచడానికి త్వరలో నూతన చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కేఎస్‌బీఎల్‌ తిరిగి చెల్లింపులపై వేచి చూసే దోరణి అవలంభిస్తున్నట్లు, ఈ నెల 14 నాటికి సంస్థ రూ.1,189 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. వీటిలో బ్యాంకులకు చెల్లించాల్సినవి రూ.511కోట్లు. మొత్తంగా సెక్యూరిటీలు రూ.183 కోట్లు తగ్గగా, ఫండ్లు రూ.495 కోట్లు తగ్గినట్లు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. 


గతేడాది నవంబర్‌లోనే కేఎస్‌బీఎల్‌లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించి దీని లైసెన్స్‌లను రద్దుచేసినట్లు చెప్పారు. ఈ విషయంలో కార్వీతోపాటు ఎన్‌ఎస్‌ఈలకు కూడా నోటీసును జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ బకాయిల చెల్లింపుల విషయంలో సంస్థకూ ఊరట కల్పించే విషయాన్సి సూచించినట్లు, వీటిలో కార్వీకు అనుబంధ సంస్థల్లో వాటాను విక్రయించడం ద్వారా సమకూరిన నిధులను వచ్చే నెల చివరి వరకు ఈ బకాయిలకు చెల్లించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. పెట్టుబడిదారుల శ్రేయస్సుకు పెద్దపీట వేయడంతోపాటు వీరి పెట్టుబడులను తిరిగి చెల్లించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు, ఇందుకోసం ఏ చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. 


వచ్చే నెల చివర్లో పదవీ విరమణ

సెబీ చైర్మన్‌గా మూడేండ్ల పాటు విధులు నిర్వహించిన త్యాగీ వచ్చే నెల 31న పదవీ విరమణ చేయబోతున్నారు. సెబీ మార్గదర్శకాలకు లోబడి పారదర్శకంగా చర్యలు తీసుకున్నట్లు, సెబీ చాలా పెద్ద సంస్థయని, ప్రతి క్షణం సవాలుతో కూడుకొనియున్నదని వ్యాఖ్యానించారు. 


సీఎండీలను సగం సంస్థలే విడగొట్టాయి..

స్టాక్‌ మార్కెట్లో లిైస్టెన సంస్థల్లో సగం కంపెనీలు మాత్రమే చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్ట్‌లను విడగొట్టాయని, అందుకోసం ఈ కాలపరిమితిని ఏప్రిల్‌ 2020 వరకు పొడిగించినట్లు త్యాగీ వెల్లడించారు. కేవలం 500 సంస్థల్లో 250 కంపెనీలు ఇదివరకు విడగొట్టాయి. అలాగే పెట్టుబడులపై సలహాలు ఇచ్చేవారు, సాండ్‌బాక్స్‌లపై కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత సలహాలు ఇచ్చేవారు డిస్ట్రిబ్యూషన్‌ సేవలను కొనసాగించరాదని స్పష్టంచేసింది. 


logo