శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 04, 2021 , 02:53:25

కిశోర్‌ బియానీపై సెబీ నిషేధం

కిశోర్‌ బియానీపై సెబీ నిషేధం

  • ఫ్యూచర్‌ రిటైల్‌ ప్రమోటర్లపై కూడా
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగే కారణం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) సీఎండీ కిశోర్‌ బియానీతో పాటు ఆ సంస్థకు చెందిన కొందరు ప్రమోటర్లపై సెబీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వేటు వేసింది. కంపెనీ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు బియానీతోపాటు ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌సీఆర్‌ఎల్‌), అనిల్‌ బియానీ, ఎఫ్‌సీఆర్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ ట్రస్టును ఏడాదిపాటు సెక్యూరిటీల మార్కెట్‌ నుంచి నిషేధించింది. అంతటితో ఆగకుండా కిశోర్‌ బియానీ, అనిల్‌ బియానీ, ఎఫ్‌సీఆర్‌ఎల్‌కు కోటి రూపాయల చొప్పున జరిమానా విధించింది. అంతేకాకుండా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో అక్రమంగా ఆర్జించిన రూ.20.53 కోట్ల లాభాలను వాపసు ఇవ్వాలని బియానీలతోపాటు ఎఫ్‌సీఆర్‌ఎల్‌, ఎఫ్‌సీఆర్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ ట్రస్టులను ఆదేశించింది. 

హైకోర్టు ఉత్తర్వుపై ఫ్యూచర్‌ అప్పీలు

రిలయన్స్‌తో కుదుర్చుకున్న రూ.24, 713 కోట్ల ఒప్పందంపై యథాస్థితిని కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వును ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థ సవాలు చేసింది. ఇందుకు సంబంధించిన అప్పీలును ఢిల్లీ హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌ ముందుం చింది. దీనిపై గురువారం విచారణ జరుగనున్నట్లు సమాచారం.

VIDEOS

logo