బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 25, 2020 , 00:38:16

టాటా-మిస్త్రీ కేసులో ఎన్సీఎల్‌ఏటీ తీర్పుపై స్టే

టాటా-మిస్త్రీ కేసులో ఎన్సీఎల్‌ఏటీ తీర్పుపై స్టే
  • ఆర్వోసీ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనవరి 24: టాటా సన్స్‌-సైరస్‌ మిస్త్రీ కేసులో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలన్న తీర్పును సవరించాలన్న ఆర్వోసీ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ గత నెల 18న నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ వ్యవహారంలో టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్పీఎల్‌) దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించి సంబంధిత పక్షాలకు నోటీసు జారీచేసింది. ఎన్సీఎల్‌ఏటీ తీర్పునకు వ్యతిరేకంగా టాటా సన్స్‌ దాఖలుచేసిన ప్రధాన పిటిషన్‌తో కలిపి ఈ అంశంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
logo