శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 08, 2021 , 01:44:01

ఎస్బీఐ 4,500 కోట్ల సేకరణ

ఎస్బీఐ 4,500 కోట్ల సేకరణ

ముంబై, జనవరి 7: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు బాండ్లను విక్రయించడం ద్వారా 600 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించింది. మన కరెన్సీలో ఇది రూ.4,500 కోట్లకు సమానం. కూపన్‌ రేటును 1.80 శాతంగా నిర్ణయించింది. స్వల్పకాలంలో 10 బిలియన్‌ డాలర్ల నిధులను సేకరించేయోచనలో భాగంగా బ్యాంక్‌ ఈ బాండ్లను జారీ చేసింది. ఈ బాండ్లకు కొనుగోలుదారుల నుంచి అనూహ్యంగా డిమాండ్‌ రాగా, 2.1 రెట్లు అధికంగా బిడ్లు వచ్చా యి. అమెరికా డాలర్‌ రూ పంలో జారీ చేసిన ఈ బాండ్ల కాలపరిమితి 5.5 ఏండ్లు. ఈవారం మొదట్లో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ 2.25 శాతం కూపన్‌ రేటుకు బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది.

VIDEOS

logo