మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 13, 2021 , 03:01:45

జన్‌ధన్‌ ఖాతాదారులకు ఎస్బీఐ 2 లక్షల బీమా

జన్‌ధన్‌ ఖాతాదారులకు ఎస్బీఐ 2 లక్షల బీమా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: జన్‌ధన్‌ ఖాతాదారులకు శుభవార్త. ఎస్బీఐ జన్‌ధన్‌ ఖాతాదారులు రూపే జన్‌ ధన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమాను పొందవచ్చని ఆ బ్యాంకు తెలిపింది. ఇప్పుడే ఎస్బీఐ రూపే జన్‌ధన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోండి అంటూ బ్యాంక్‌ ట్వీట్‌ చేసింది. ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన కింద 41.75 కోట్ల బ్యాంక్‌ ఖాతాలు తెరుచుకోగా, ఇందులో 35.96 కోట్ల ఖాతాలు ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. గ్రామీణ ప్రజలు, పట్టణాల్లోని గృహస్తులకు బ్యాంకింగ్‌ సేవలను అందించాలనే లక్ష్యంతో జన్‌ధన్‌ ఖాతాలను కేంద్రం పరిచయం చేసింది. 

జన్‌ధన్‌ ఖాతాను ఎవరు తెరువచ్చు?

భారతీయులు ఎవరైనా ఈ ఖాతాను తీసుకోవచ్చు. వయసు పదేండ్లు అంతకుమించి ఉండాలి.

జన్‌ధన్‌ ఖాతా ప్రయోజనాలేంటి?

  • ప్రభుత్వ పథకాల లాభాలు నేరుగా ఖాతాల్లోకే
  • ఉచిత మొబైల్‌ బ్యాంకింగ్‌ సదుపాయం
  • ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత విదేశీ సౌకర్యం
  • రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా
  • రూ.30 వేల వరకు జీవిత బీమా
  • రూపే డెబిట్‌ కార్డుపై నగదు ఉపసంహరణ, కొనుగోళ్ల సదుపాయం
  • నగదు డిపాజిట్‌పై వడ్డీ
  • దేశవ్యాప్తంగా నగదు బదిలీ సౌకర్యం

ఖాతాల ద్వారా సులభంగా బీమా, పెన్షన్‌ల కొనుగోలుకావాల్సిన డాక్యుమెంట్లు ఏవి?

ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కేవైసీకి కావాల్సిన ఇతర ఏవైనా ధ్రువపత్రాలు

VIDEOS

logo