మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 20, 2021 , 18:54:45

డిజిట‌ల్ చెల్లింపు‌కు యోనో మ‌ర్చంట్ యాప్‌.. ఇదీ ఎస్బీఐ మ‌ర్మం!

డిజిట‌ల్ చెల్లింపు‌కు యోనో మ‌ర్చంట్ యాప్‌.. ఇదీ ఎస్బీఐ మ‌ర్మం!

న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపార వాణిజ్య చెల్లింపుల డిజిట‌లైజేష‌న్‌ను విస్త‌రించేందుకు త‌న అనుబంధ యాప్ యోనో మ‌ర్చంట్ యాప్‌ను విస్త‌రించాల‌ని స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్ణ‌యించింది. మొబైల్ సార‌ధ్యంలోని టెక్నాల‌జీ ద్వారా డిజిట‌ల్ పేమెంట్స్‌ను ల‌క్ష‌ల మంది వ్యాపారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎస్బీఐ కృత నిశ్చయంతో ఉంది.

ఇందుకోసం ఎస్బీఐ వ‌చ్చే రెండేండ్ల‌లో దేశ‌వ్యాప్తంగా లో-కాస్ట్ యాక్సెప్టెన్స్ మౌలిక వ‌స‌తుల‌ను అందుబాటులోకి తేనున్న‌ది. దేశీయంగా రిటైల్ అండ్ ఎంట‌ర్‌ప్రైజెస్ రంగంలో వ్యాపార లావాదేవీలు నిర్వ‌హిస్తున్న రెండు కోట్ల మంది వ్యాపారుల‌ను యోనో మ‌ర్చంట్ యాప్ ప‌రిధిలోకి తేవాని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది ఎస్బీఐ.

దేశ‌వ్యాప్తంగా ఫిజిక‌ల్ అండ్ డిజిట‌ల్ రూపేణా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్‌) మౌలిక వ‌స‌తుల‌ను ప్రోత్స‌హించేందుకు పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్‌)ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్ర‌క‌టించింది. ఆర్బీఐ మార్గంలోనే ప్ర‌యాణిస్తున్న ఎస్బీఐ కూడా సొంతంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌తో యోనో మ‌ర్చంట్ యాప్‌ను విస్త‌రించ‌త‌ల‌పెట్టింది. 

మూడేండ్ల క్రితం ఎస్బీఐ ప్రారంభించిన యోనో ప్లాట్‌ఫామ్‌కు 35.8 మిలియ‌న్ల మంది రిజిస్ట‌ర్డ్ యూజ‌ర్లు ఉన్నారు. త‌మ మ‌ర్చంట్ల‌కు సౌల‌భ్య‌క‌రమైన చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవ‌డానికి యోనో మ‌ర్చంట్ యాప్ ఆవిష్క‌ర‌ణ అని ఎస్బీఐ తెలిపింది. యోనో మ‌ర్చంట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వ్యాపారులు.. సింపుల్ మొబైల్ యాప్ ద్వారా ఎన్ఎఫ్‌సీ ఎనేబుల్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుంచి డిజిట‌ల్ చెల్లింపులు చేయొచ్చు. 

ఎస్బీఐ చైర్మ‌న్ దినేశ్ కుమార్ ఖ‌రా మాట్లాడుతూ ‘మా డిజిట‌ల్ పేమెంట్స్ సబ్సిడ‌రీ ఎస్బీఐ పేమెంట్స్ ద్వారా యోనో ఎస్బీఐ మ‌ర్చంట్ యాప్ ఆవిష్క‌రిస్తున్నందుకు అపార‌మైన ఆనందం క‌లుగుతున్న‌ది’ అని చెప్పారు. వ‌చ్చే రెండు, మూడేండ్ల‌లో ల‌క్ష‌ల మంది వ్యాపారుల మొబైల్ ఫోన్ల అప్‌గ్రేడింగ్ ద్వారా వారి లావాదేవీల‌ను డిజిట‌లైజ్ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. 

ఎస్బీఐ పేమెంట్స్ ఎండీ అండ్ సీఈవో గిరి కుమార్ నాయ‌ర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ‘మా క‌స్ట‌మ‌ర్ల‌కు ఇన్నోవేష‌న్‌తో కూడిన సేవ‌లందించేందుకు ఎస్బీఐ పేమెంట్స్ ముందు వ‌రుస‌లో నిలుస్తుంది. వ‌చ్చే రెండు లేదా మూడేండ్ల‌లో మా మ‌ర్చంట్ ట‌చ్ పాయింట్ల‌ను 5-10 మిలియ‌న్ల సంఖ్య‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం’ అని తెలిపారు. ఇంట‌ర్నేష‌న‌ల్ పేమెంట్స్ స‌ర్వీసెస్ సంస్థ వీసాతో భాగ‌స్వామ్యం గ‌ల ఎస్బీఐ దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ యాక్సెప్టెన్స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అందుబాటులోకి తేనున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo