శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 17, 2020 , 08:35:09

2020-21 వృద్ధిరేటుపై ఎస్బీఐ అంచనా

2020-21 వృద్ధిరేటుపై ఎస్బీఐ అంచనా

ముంబై: దేశ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం 1.1 శాతానికే పరిమితం కావచ్చని ఎస్బీఐ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభా వం తీవ్రంగా ఉందని గురువారం ఓ నివేదికలో పేర్కొన్నది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌ను కేంద్రం వచ్చే నెల 3దాకా పొడిగించినది తెలిసిందే. ఈ క్రమంలో దేశ జీడీపీ అంచనాలు ఒక్కసారిగా తలకిందులవుతున్నాయి. ఎస్బీఐ ఎకోరాప్‌ నివేదిక ప్రకారం లాక్‌డౌన్‌ పొడిగింపుతో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 21.1 లక్షల కోట్ల నష్టం రావచ్చని అంచనా. దీంతో దేశ జీడీపీ 1.1 శాతానికి దిగజారవచ్చన్నది. పన్నుల ఆదాయం పడిపోతుందని, కొనుగోళ్ల సామర్థ్యం తగ్గి ఉత్పత్తి పతనం అవుతుందని పేర్కొన్నది. ఇక 2019-20 వృద్ధిరేటు అంచనాను వివిధ సంస్థలు 4.1 శాతానికి దించినది విదితమే.


logo