బుధవారం 03 జూన్ 2020
Business - May 06, 2020 , 17:58:56

ఎస్బీఐ అత్యవసర రుణాలు

ఎస్బీఐ అత్యవసర రుణాలు

ముంబై, మే 6: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. కరోనా వైరస్ నేపథ్యంలో అత్యవసర రుణాలను అందుబాటులోకి తెచ్చింది. రూ.5 లక్షల వరకు తీసుకోవచ్చు. కేవలం 45 నిమిషాల్లోనే ఈ రుణాలను పొందగలగడం గమనార్హం. లాక్ పరిస్థితులతో ఆదాయం కోల్పోయిన వారి కోసం, ఇతరత్రా అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ రుణాలను ఎస్బీఐ ఇస్తున్నది. ఇతర వ్యక్తిగత రుణాలతో పోల్చితే ఈ అత్యవసర రుణాలపై వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. 10.5 శాతం వడ్డీరేటుకే ఈ రుణాలు లభించనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రుణం తీసుకున్న 6 నెలల తర్వాత నుంచే ఈఎంఐలను చెల్లించవచ్చు. క్షీణించిన ఆదాయం, ఇతరత్రా ఆర్థిక సమస్యల దృష్ట్యా ఎస్బీఐ ఈ వెసులుబాటును కల్పించింది. ఈ రుణాలు కావాలనుకునేవారు ఎప్పుడైనాసరే ఆన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం onlinesbi.com లేదా sbi.co.inలోకి లాగిన్ కావచ్చు.


logo