బుధవారం 03 జూన్ 2020
Business - May 07, 2020 , 16:23:40

ఎఫ్‌డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ

ఎఫ్‌డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ

ముంబై: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లను తగ్గిస్తూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. వడ్డీ రేట్లను 3 సంవత్సరాల వరకు టేనర్‌కు 20 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. ఈ నిర్ణయం ఈ నెల 12వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఎఫ్‌డీలపై రేట్లను తగ్గించడం రెండు నెలల్లో ఇది మూడోసారి. సేవింగ్స్‌ అకౌంట్ల వడ్డీ రేట్లను కూడా గత నెలలోనే తగ్గించారు.

వ్వవస్థలో, బ్యాంకులో తగినంత ద్రవ్యత దృష్ట్యా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎస్బీఐ వెల్లడించింది. అన్ని టేనర్‌లలో 15 బేసిస్‌ పాయింట్ల ద్వారా నిధుల ఆధారిత రుణ రేటు యొక్క ఉపాంత వ్యయాన్ని కూడా తగ్గించినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. ఇదే సమయంలో సీనియర్‌ సిటిజన్లను ఆకర్శించేందుకు వారి కోసం ప్రత్యేకంగా 'ఎస్బీఐ వీ కేర్‌ డిపాజిట్‌ స్కీం'ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.


logo