5 లక్షల కోట్ల మార్కు దాటిన వ్యాపారం

- పదేండ్లలో ఐదురెట్లు పెరిగిన ఏయూఎం
- 2024 నాటికి రూ.7 లక్షల కోట్ల లక్ష్యం
ముంబై, ఫిబ్రవరి 10: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాల వ్యాపారంలో శరవేగంగా పురోగమిస్తున్నది. ఈ విభాగంలో తమ వ్యాపారం రూ.5 లక్షల కోట్ల మార్కును దాటినట్లు బుధవారం ఆ బ్యాంకు ప్రకటించింది. గత పదేండ్లలో ఎస్బీఐ రియల్ ఎస్టేట్, హౌసింగ్ బిజినెస్ యూనిట్ (ఆర్ఈహెచ్బీయూ) పరిమాణం ఐదు రెట్లు వృద్ధి చెందినట్లు వెల్లడించింది. 2011లో రూ.89 వేల కోట్లుగా ఉన్న ఏయూఎం (అసెట్స్ అండర్ మేనేజ్మెంట్).. 2021లో రూ.5 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. తమ బ్యాంకు పట్ల కస్టమర్లు అచంచల విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారనడానికి ఈ మైలురాయే నిదర్శనమని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా సంతోషాన్ని వ్యక్తం చేశారు. గృహ రుణాల పంపిణీ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు రిటైల్ లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆర్ఎల్ఎంఎస్)ను అందుబాటులోకి తీసుకురావడం సహా ఇతర డిజిటల్ పద్ధతులపై ఎస్బీఐ కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.7 లక్షల కోట్ల హోమ్ లోన్ ఏయూఎంను సాధించాలని ఎస్బీఐ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశీయ గృహ రుణాల మార్కెట్లో ఎస్బీఐకి 34 శాతం వాటా ఉన్నది. 2004లో రూ.17 వేల కోట్ల పోర్టుఫోలియోతో గృహ రుణాల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎస్బీఐ.. 2012లో మొత్తం రూ.లక్ష కోట్ల పోర్టుఫోలియోతో ప్రత్యేకంగా ఆర్ఈహెచ్బీయూని ఏర్పాటు చేసుకున్నది.
తాజావార్తలు
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ