e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News Taliban base Lithium | వామ్మో.. ఆప్ఘన్‌లో అన్ని లక్షల కోట్ల సంపద ఉందా ? ఎలక్ట్రిక్‌ బైకులకూ బేస్‌ అదేనా?

Taliban base Lithium | వామ్మో.. ఆప్ఘన్‌లో అన్ని లక్షల కోట్ల సంపద ఉందా ? ఎలక్ట్రిక్‌ బైకులకూ బేస్‌ అదేనా?

Taliban base Lithium | పెట్రోలియం ఉత్ప‌త్తుల‌కు సౌదీ అరేబియా పెట్టింది పేరు.. ప్ర‌స్తుతం తాలిబ‌న్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘ‌నిస్థాన్ కూడా అపురూప‌మైన ఖ‌నిజాల‌కు నిల‌యం.. భూతాప నివార‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసే కాలుష్య నియంత్ర‌ణ‌కు యావ‌త్ ప్ర‌పంచ క‌ర్బ‌న ర‌హిత ఇంధ‌న వినియోగం దిశ‌గా అడుగులేస్తున్న‌ది. పెట్రోల్ లేదా డీజిల్‌ల‌కు ప్ర‌త్యామ్నాయం ఎల‌క్ట్రిక్‌కు ఇప్పుడు డిమాండ్‌. విద్యుత్ వాహ‌నాల‌ను న‌డుప‌డంలో బ్యాట‌రీల త‌యారీలో లిథియం కీల‌కం. క్రూడాయిల్‌కు సౌదీ అరేబియా మాదిరే ఆఫ్ఘ‌నిస్థాన్ కూడా లిథియం నిల్వల‌కు మారుపేరని వివిధ స‌ర్వేలు చెబుతున్నాయి.

ప్ర‌పంచంలోకెల్లా అత్య‌ధికంగా ఆఫ్ఘ‌న్‌లో లిథియం నిల్వ‌లు ఉన్నాయ‌ని తేలింది. అమెరికా ర‌క్ష‌ణశాఖ రూపొందించిన ర‌హ‌స్య నివేదిక‌.. ఆఫ్ఘ‌న్ ఒక ‘సౌదీ అరేబియా ఆఫ్ లిథియం’ అని పేర్కొంది.ఆఫ్ఘ‌న్‌లో ఉన్న స‌హ‌జ వ‌న‌రులు, ఖ‌నిజాలు, మిన‌ర‌ల్స్ విలువ రూ.2.02 కోట్ల కోట్లు (3 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల పైమాటే) అంటే.. ఎంత విలువైన సంప‌ద ఉందో అర్థ‌మ‌వుతుంది క‌దా..

లిథియం నిల్వ‌ల్లో ఆప్ఘ‌న్ టాప్

- Advertisement -

ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా లిథియం నిల్వ‌ల‌కు నిల‌యం ఆఫ్ఘ‌న్ అని తెలుస్తున్న‌ది. లిథియంను రీచార్జ‌బుల్ బ్యాట‌రీల త‌యారీలో వినియోగిస్తారు. పెట్రోలియం ఆధారిత వాహ‌నాల‌ను ఎల‌క్ట్రిక్ వాహ‌నాల దిశ‌గా ప‌రివ‌ర్త‌న చెంద‌డానికి లిథియం చాలా ముఖ్యం.. ఇంకా.. క‌న్జూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ నుంచి మిలిట‌రీ ప‌రిక‌రాల త‌యారీలో వాడే అరుదైన ఖ‌నిజాలు 1.9 మిలియ‌న్ ట‌న్నులు ఉంటాయ‌ని అంచ‌నా.

ముడి చ‌మురు నిల్వ‌లు పుష్క‌లం

సుమారు 1.6 బిలియ‌న్ల బ్యారెళ్ల ముడి చ‌మురు 16 ట్రిలియ‌న్ క్యూబిక్ అడుగుల స‌హ‌జ వాయువు, మ‌రో 500 మిలియ‌న్ల బ్యారెళ్ల స‌హ‌జ‌వాయువు లిక్విడ్స్ ఉన్నాయి. 2019లో 107 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన ముడి చ‌మురు ఉంద‌ని అమెరికా-ఆఫ్ఘ‌న్ సంయుక్త అంచ‌నా. లిథియం బేరింగ్‌లో ఉప‌యోగించే స్పోడుమెన్ నిల్వ‌లు పుష్క‌లం.

ఐర‌న్ ఓర్ ఇలా..

2.2 బిలియ‌న్ ట‌న్నుల పై చిలుకు ఐర‌న్ ఓర్ ఉంద‌ని తెలుస్తున్న‌ది. ప్ర‌స్తుత మార్కెట్ ధ‌ర‌ల ప్ర‌కారం దాని విలువ 350 బిలియ‌న్ డాల‌ర్ల పై చిలుకే. బంగారం స‌హా ఇత‌ర లోహాలు 2700 కిలోల మేర‌కు నిల్వ‌లు ఉన్నాయ‌ని అంచ‌నా. టిన్, పాద‌ర‌సం, జింక్ వంటి లోహాలు ఆఫ్ఘ‌న్ పొడ‌వునా ఉన్నాయ‌ని నివేదిక‌లు చెప్తున్నాయి.

దాదాపు పుష్క‌ర కాలం క్రితం అంటే 2010లో నిర్ధారించ‌ని మెట‌ల్స్‌, మిన‌ర‌ల్స్ విలువ మూడు ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు ఉంటుంద‌ని ఆఫ్ఘ‌న్ భూగ‌ర్భ గ‌నులశాఖ మాజీ మంత్రి అంచ‌నా వేశారు. క‌రోనాతో లోహాల విలువ భారీగా పెరిగిపోయింది.

ఖ‌నిజాల క‌ణాచి ఆఫ్ఘ‌న్‌

రాగి, బంగారం, ముడి చ‌మురు, స‌హ‌జ వాయువు, యురేనియం, బాక్సైట్‌, బొగ్గు, ఐర‌న్ ఓర్‌, లిథియం, క్రోమియం, జింక్‌, జెమ్ స్టోన్స్‌, టాల్క్‌, పాద‌ర‌సం, స‌ల్ఫ‌ర్‌, జిప్సం, మార్బుల్ త‌దిత‌ర ఖ‌నిజాల‌కు నిధి ఆఫ్ఘ‌న్‌. అమెరికాతోపాటు ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం ఈ సంగ‌తిని నిర్ధారించాయి.

30 మిలియ‌న్ ట‌న్నుల రాగి నిల్వ‌లు

2019లో ఆఫ్ఘ‌న్ భూగ‌ర్భ‌, పెట్రోలియం మంత్రిత్వ‌శాఖ అంచ‌నా ప్ర‌కారం దాదాపు 30 మిలియ‌న్ ట‌న్నుల రాగి నిల్వ‌లు, మ‌రో 28.5 మిలియ‌న్ ట‌న్నుల పొర్పైరీ నిల్వ‌లు ఉన్నాయి. నిగ్గు తేల్చ‌ని రాగి నిల్వ‌లు బిలియ‌న్ డాల‌ర్ల‌పై మాటే.

కాబూల్ స‌హా ప‌లు ప్రాంతాల్లో మాన‌వ‌త్వ సంక్షోభం

ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్ స‌హా ఇత‌ర ప్రాంతాల్లో నెల‌కొన్న మాన‌వ‌తా సంక్షోభం కొన్ని రోజులుగా యావ‌త్ ప్ర‌పంచాన్నే క‌ల‌వ‌ర ప‌రుస్తున్న‌ది. ఆఫ్ఘ‌న్ల‌తోపాటు అక్క‌డ ఉన్న వివిధ దేశాల పౌరులు ఎప్పుడేం జ‌రుగుతుందోన‌ని వ‌ణికిపోతున్నారు. ఆఫ్ఘ‌న్‌లో పాల‌నా ప‌గ్గాలు చేపట్టిన తాలిబ‌న్లు దేశంలో గ‌ల స‌హజ వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుని ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి క్రుషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ ఆఫ్ఘ‌న్‌లో 90 శాతం జ‌నాభా దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారే. వారి రోజువారీ ఆదాయం రెండు డాల‌ర్లు మాత్ర‌మే. కానీ దేశంలో ఉన్న స‌హ‌జ వ‌న‌రులు మూడు ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల పైమాటే. ఇటీవ‌లే ప్ర‌భుత్వ ప‌గ్గాల‌ను చేప‌ట్టిన తాలిబ‌న్లు.. ప్ర‌పంచంలోకెల్లా పేద‌లైన ఆఫ్ఘ‌న్ల అభ్యున్న‌తికి ఈ స‌హ‌జ వ‌న‌రుల‌ను పూర్తిగా ఉప‌యోగించుకోలేరేమోన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement