రెండేండ్లలో 1,000 అవుట్లెట్లు

- తెలంగాణలో మరింత విస్తరణ.. సంగీతా మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర
హైదరాబాద్, జనవరి 16: మొబైల్ విక్రయ అగ్రగామి సంస్థల్లో ఒకటైన సంగీతా మొబైల్స్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. దేశీయ అతిపెద్ద మొబైల్ స్టోర్ లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..వచ్చే రెండేండ్లకాలంలో స్టోర్ల సంఖ్యను వెయ్యికి పెంచుకోవాలని చూస్తున్నది. ప్రస్తుతం సంస్థ దక్షిణాదిలో 700కి పైగా స్టోర్లను నిర్వహిస్తున్నది. నగరాలతో పోలిస్తే చిన్న స్థాయి పట్టణాల్లో మొబైల్ విక్రయాలు అంతకంతకు పెరుగుతుండటంతో సంస్థ ఈ దిశగా విస్తరణ బాట పట్టింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో సొంతంగా 700కి పైగా షోరూంలను నిర్వహిస్తున్నట్లు, వచ్చే రెండేండ్ల కాలంలో ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోవాలనుకుంటున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణతోపాటు ఏపీల్లోని ప్రతి చిన్న నగరాల్లో స్టోర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వారణాసి, అహ్మదాబాద్‌లలో మాత్రమే ఫ్రాంచైజ్ పద్దతిన షోరూంలను ఏర్పాటు చేయగా, అతి త్వరలో కేరళ మార్కెట్లోకి ప్రవేశించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ప్రస్తుతం సంస్థలో 2,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని, అయితే ప్రతి ఉద్యోగికి సగం జీతం ఇచ్చి, 5 లక్షల జీవిత బీమా చేయించామని తెలిపారు.
ఏడాది వరకు సంక్రాంతి ఆఫర్లు
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించిన 30 రోజుల డ్యామేజ్ ప్రొటెక్షన్ పథకాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మొబైల్ పగిలిపోతే అక్కడికక్కడే వినియోగదారుడికి సగం ధరకే కొత్త ఫోన్ అందిస్తామన్నారు. నీటిలో పడిపోయిన కొత్త ఫోన్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి మొబైల్ కొనుగోలు దేశంలో ఏక్కడ లేని విధంగా 21 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేసే ప్రతి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నది. అలాగే కొనుగోలు చేసిన ఫోన్ ధర ఒకవేళ నెల రోజుల్లో తగ్గితే ఆ తగ్గిన ధర పోగా మిగిలిన డబ్బును కొనుగోలు చేసిన వారికి సంస్థ ఇస్తున్నది.
2022లో ఐపీవోకి..
మరోవైపు సంగీతా మొబై ల్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి కసరత్తు చేస్తున్నది. ఎలక్ట్రానిక్ విక్రయాల్లో సత్తా చాటుతున్న సంస్థ.. 2022 వరకు ఐపీవోకి వచ్చే అవకాశం ఉన్నదని సుభాష్ చంద్ర సంకేతాలిచ్చారు. అప్పటి మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎంతమేర వాటా విక్రయించేదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,950 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ.. ఈ ఏడాది కూడా ఇంతే స్థాయి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామనే ధీమాను వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ