గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 22, 2020 , 23:14:31

హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ ఆఫీస్‌

హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ ఆఫీస్‌


హైదరాబాద్‌, జనవరి 22: అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలో ఒకటైన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌.. హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. స్కైవ్యూ బిల్డింగ్‌లో 2.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్‌కు యూఎస్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(యూఎస్‌జీబీసీ) గోల్డ్‌-రేటెడ్‌ ఎల్‌ఈఈడీ సర్టిఫికేషన్‌ ఇచ్చింది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శణమని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిశేక్‌ థోమర్‌ తెలిపారు. పరిశోధన రంగాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్‌ను ప్రారంభించినట్లు, స్కైవ్యూ ఆఫీస్‌ కూడా పర్యావరణ అనుకూలంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. 


logo