ఆదివారం 17 జనవరి 2021
Business - Dec 01, 2020 , 16:46:53

బాటా హిస్టరీలో ఫస్ట్ టైం : బాటా గ్లోబల్ సిఈఓగా ఇండియన్

 బాటా హిస్టరీలో ఫస్ట్ టైం : బాటా గ్లోబల్ సిఈఓగా ఇండియన్

బెర్లిన్ :మల్టీనేషనల్ ఫుట్ వేర్ తయారీ సంస్థ బాటా కీలక నిర్ణయం తీసుకున్నది.126 ఏండ్ల బాటా చరిత్రలో ఓ భారతీయుడిని గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) గా నియమించడం విశేషం. ప్రస్తుతం బాటా ఇండియా సీఈఓగా పనిచేస్తున్నసందీప్ కటారియాను బాటా సంస్థ గ్లోబల్ సీఈఓగా ప్రమోషన్ ఇచ్చింది. ఇప్పటివరకు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా దాదాపు ఐదేండ్ల నుం చి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అలెక్సిస్ నాసార్డ్ పదవీ విరమణ చేయడం తో సందీప్ కటారియా గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

లాభాల బాటలో నడిపిస్తా... 

బాటా గ్లోబెల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అపాయింట్ అయిన తర్వాత కటారియా మాట్లాడుతూ, "ఈ కొత్త నియామకంతో తనకు గౌరవం దక్కిందని , అధిక నాణ్యత, సరసమైన పాదరక్షల కోసం ఆశించదగిన ఖ్యాతిని కలిగి ఉన్న బ్రాండ్ బాటా అని స్థిరమైన వృద్ధి , లాభదాయకత ను పెంచడానికి తన శాయశక్తులా పని చేస్తానని అన్నారు. భారతదేశంలో బాటా విజయం , షూ తయారీదారులుగా ప్రపంచానికి చాటిచెప్పే విధంగా 125 ఏండ్ల బాటా చరిత్రను మరింతగా ఇనుమడింప చేస్తానని సందీప్ కటారియా తెలిపారు. 2020లో కరోనా సవాళ్ల నేపథ్యంలోనూ మా బ్రాండ్ల క్వాలిటీ ప్రజల అభిరుచి సంస్థ పట్ల విశ్వాసానికి ప్రతీకలని, రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలను అందుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.