శనివారం 04 జూలై 2020
Business - Jul 01, 2020 , 00:44:56

సామ్‌సంగ్‌ రెండు రకాల టెలివిజన్లను దేశీయ మార్కెట్‌కులోకి విడుదల చేసింది

సామ్‌సంగ్‌ రెండు రకాల టెలివిజన్లను దేశీయ మార్కెట్‌కులోకి  విడుదల చేసింది

మంగళవారం దేశీయ మార్కెట్‌కు సామ్‌సంగ్‌ రెండు రకాల టెలివిజన్లను పరిచయం చేసింది. లైఫ్‌స్టయిల్‌ టెలివిజన్‌ ది సెరిఫ్‌, క్యూఎల్‌ఈడీ 8కే టీవీలను ఆవిష్కరించింది. సెరిఫ్‌ మోడల్‌లో 43, 49, 55 అంగుళాల టీవీలను తీసుకురాగా.. వీటి ధరలు వరుసగా రూ.83,900, రూ.1.16 లక్షలు, రూ.1.48 లక్షలుగా ఉన్నాయి. క్యూఎల్‌ఈడీలో 65, 75, 82, 85 అంగుళాల టీవీలున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.4.99 లక్షలు, రూ.9.99 లక్షలు, రూ.14.29 లక్షలు, రూ.15.79 లక్షలుగా ఉన్నాయి. క్యూఎల్‌ఈడీ అంతటా లభిస్తున్నా.. లైఫ్‌స్టయిల్‌ టీవీ అమెజాన్‌, సామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్లు, సామ్‌సంగ్‌ స్మార్ట్‌ ప్లాజాల్లో మాత్రమే లభించనున్నది. 


logo