సోమవారం 01 మార్చి 2021
Business - Jan 28, 2021 , 19:38:23

శ్యామ్‌సంగ్ మ‌రో బ‌డ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంవో2‌ ..! 2న లాంచింగ్‌!!

శ్యామ్‌సంగ్ మ‌రో బ‌డ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంవో2‌ ..! 2న లాంచింగ్‌!!

న్యూఢిల్లీ: ద‌క్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజ‌ర్ శ్యామ్‌సంగ్ తదుప‌రి త‌న బ‌డ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంఓ2 ను భార‌త్‌లో ఫిబ్ర‌వ‌రి రెండో తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ది. వ‌చ్చే మంగ‌ళ‌వారం నాడు మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు విప‌ణిలో అడుగు పెట్ట‌నున్న‌ది గెలాక్సీ ఎంవో2. లైవ్ స్ట్రీమ్‌లో దీన్ని లాంచ్ చేయ‌నున్నారు. గ‌తేడాది జూన్‌లో శ్యామ్‌సంగ్ ఆవిష్క‌రించిన గెలాక్సీ ఎంఓ1కు కొన‌సాగింపుగా ఎం సిరీస్‌లో భాగంగా వినియోగ‌దారుల‌కు చౌక ధ‌ర‌లో ఈ ఎంవో2 ఫోన్ వ‌స్తోంది. దీని ధ‌ర రూ.7000 లోపు ఉంటుంద‌ని భావిస్తున్నారు. 

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎంవో1 ఫోన్ ధ‌ర రూ.8,999 కాగా, సింగిల్ 3జీబీ ర్యామ్ ప్ల‌స్ 32 జీబీ స్టోరేజీ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎంవో1 ఫోన్ ధ‌ర‌ను రూ.7,499కి ద‌గ్గించారు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎంవో2 ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ ప్ల‌స్ వీ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీతో వినియోగ‌దారుల ముంగిట్లోకి వ‌స్తోంది. యూర‌ప్‌లో గ‌త న‌వంబ‌ర్‌లో ఆవిష్క‌రించిన గెలాక్సీ ఏఓ2 మోడ‌ల్ ఫోన్‌ను రీ బ్రాండ్ చేసి గెలాక్సీ ఎంవో2గా విడుద‌ల చేస్తున్నార‌ని తెలుస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo