మంగళవారం 26 మే 2020
Business - May 06, 2020 , 07:20:22

సామ్‌సంగ్‌ కరోనా ఆఫర్లు

సామ్‌సంగ్‌ కరోనా ఆఫర్లు

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థ సామ్‌సంగ్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘స్టే హోమ్‌, స్టే హ్యాప్పీ’ పేరుతో ప్రకటించిన ఈ ముందస్తు ఆఫర్‌లో భాగంగా 15 శాతం క్యాష్‌బ్యాక్‌, ఈఎంఐలపై అదనపు చెల్లింపులు ఉండవని తెలిపింది. ఆఫర్‌ కోసం సామ్‌సంగ్‌ షాప్‌, ఎక్స్‌ప్రెస్‌ డెలివరీలో ఈ నెల 8లోపు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు, స్మార్ట్‌ ఓవెన్స్‌లకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.


logo