మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 24, 2020 , 02:21:32

సేఫ్‌వే అత్యాధునిక శానిటైజర్‌

సేఫ్‌వే  అత్యాధునిక శానిటైజర్‌

హైదరాబాద్‌: రాష్ర్టానికి చెందిన ప్రముఖ స్టార్టప్‌ సేఫ్‌వే..మార్కెట్లోకి అత్యాధునిక యూవీ శానిటైజర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బాక్స్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కారు తాళాలు, నగలను శుభ్రం చేసుకోవచ్చునని తెలిపింది. ఔషధాలు తప్పా ఇతర వాటిని కేవలం మూడు నుంచి పది నిమిషాల్లో శుభ్రం చేయనున్న ఈ పరికరం సురక్షితమైనదని కంపెనీ డైరెక్టర్‌ ప్రణీత్‌ తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా  సీసీఎంబీ సర్టిఫైచేసిన ఈ బాక్స్‌ ద్వారా కేవలం రెండు నిమిషాల్లోనే వైరస్‌ అంతం అవుతున్నదన్నారు. 


logo