లాకర్‌తో బేఫికర్

సొమ్ములు భద్రం
విలువైన ఆభరణాలను, ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు బ్యాంకులో లాకర్ సదుపాయాన్ని తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. ఇంటికి సమీపంలో ఉన్న బ్యాంకు లో ఈ సదుపాయాన్ని పొందాలని చూస్తుం టారు. కానీ ఆ శాఖలో ఉన్న లాకర్లన్నింటినీ అప్పటికే వేరే వారికి ఇచ్చి ఉండటం వల్ల మీకు లాకర్ అందుబాటులో ఉండకపోవచ్చు. అయినప్పటికీ మీరు ఆ శాఖలోనే మీరు లాకర్ సదుపాయాన్ని పొందాలనుకుంటే.. వెంటనే ఆ బ్యాంకు లాకర్ వెయిటింగ్ లిస్టులో మీ పేరు రిజిస్టర్ చేయించుకోవాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. లాకర్ల కేటాయింపునకు బ్యాంకులు వెయిటింగ్ లిస్టును మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. లాకర్ కోసం వచ్చే ప్రతి అప్లికేషన్‌ను సదరు బ్యాంకు గుర్తించి ఆ దరఖాస్తుదారునికి వెయిటింగ్ లిస్ట్ నంబర్‌ను ఇస్తుం ది. ఈ వెయిటింగ్ లిస్టులో ‘ముందున్న వారికి ముందు’ అనే పద్ధతిలో లాకర్ సదుపాయాన్ని కల్పిస్తుంది. కనుక అప్పటికే ఆ శాఖలో లాకర్లను తీసుకున్న వారిలో ఎవరైనా ఆ సదుపాయాన్ని వదిలేసుకుంటే వెయిటింగ్ లిస్టులో ముందున్నవారు ఆ లాకర్‌ను తీసుకునేందుకు అర్హులవుతారు. ఈ సదుపాయాన్ని పొందాలంటే ఆ బ్యాంకులో మీరు ఖాతాను కలిగి ఉండనక్కర్లేదు. సాధారణంగా బ్యాంకులు ఎవరికైనా లాకర్ సదుపాయాన్ని కేటాయించేటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్‌ను తెరవాల్సిందిగా వారికి సూచిస్తాయి. లాకర్‌కు చెల్లించాల్సిన మూడేండ్ల అద్దెతోపాటు ఏవైనా అనుకోని పరిస్థితుల్లో లాకర్‌ను బద్ధలుకొట్టి తెరిచేందుకు విధించే చార్జీలకు సమానమైనంత మొత్తంతో ఫిక్స్డ్ డిపాజిట్‌ను తెరవాల్సిందిగా బ్యాంకులు కోరుతాయి. దీనికి ఆర్బీఐ నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌ను బ్యాంకు తన వద్ద సెక్యూరిటీ డిపాజిట్‌గా పెట్టుకొని మీకు రశీదు (ఎక్నాలెడ్జ్మెంట్) ఇస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని లాకర్ అద్దె కింద సర్దుబాటు చేసుకునేలా బ్యాంక్‌కు మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవచ్చు.
ఆపరేటింగ్ నిబంధనలు
లాకర్‌ను ఆపరేట్ చేసేందుకు మీరు విధిగా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లాకర్‌ను తరచూ ఆపరేట్ చేయాలి. లేకపోతే మీరు అద్దె చెల్లించారా? లేదా? అన్న దానితో నిమిత్తం లేకుండా మీకు లాకర్ కేటాయింపును రద్దుచేసి మీ లాకర్‌ను ఓపెన్ చేస్తారు. కానీ ఈ పని చేయడానికి ముందే మీకు బ్యాంకు నోటీసు పంపుతుంది. లాకర్లను తీసుకున్న కస్టమర్ల రిస్క్ ప్రొఫైల్‌ను బట్టి బ్యాంకులు వారిని వేర్వేరు క్యాటగిరీలుగా వర్గీకరిస్తాయి. ఇది కస్టమర్ల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, వారి వ్యాపార స్వభావం, లొకేషన్ లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అధిక రిస్క్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్లు సంవత్సరంలో కనీసం ఒక్కసారి, మీడియం (మధ్య స్థాయి) రిస్క్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్లు మూడేండ్లలో కనీసం ఒక్కసారి లాకర్‌ను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు, ఆరుగురు దుర్మరణం
- ' ఉప్పెన' మేకింగ్ వీడియో చూడాల్సిందే
- మతిస్థిమితం లేని వ్యక్తిని.. కుటుంబంతో కలిపిన ఒక పదం
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి !!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49