శనివారం 11 జూలై 2020
Business - Jun 11, 2020 , 00:40:16

గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సీఎం కృషి :విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సీఎం కృషి :విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

శంకర్‌పల్లి/నవాబుపేట: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డిజిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.3.06 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు వరుసల బీటీ రోడ్డు పనులకు, వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం గంగ్యాడ, ముబారక్‌పూర్‌ గ్రామాల పరిధిలోని మూసీ నదిపై చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  కార్యక్రమంలో రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.


logo