సోమవారం 01 జూన్ 2020
Business - Apr 17, 2020 , 08:14:51

అయ్యయ్యో.. రూపాయి

అయ్యయ్యో.. రూపాయి

  • ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి మారకం పతనం 
  • 43 పైసలు క్షీణించి 76.87కు చేరిక

ముంబై, ఏప్రిల్‌ 16: డాలర్‌తో పోల్చి తే రూపాయి మారకం విలువ గురువారం ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి క్షీణించింది. 43 పైసలు పడిపోయి 76.87 స్థాయికి పతనమైంది. మునుపెన్నడూ రూపాయి మారకం విలువ ఇంత దారుణంగా పలికిన దాఖలాలు లేవు. కరోనా ప్రభావిత ఆర్థిక పరిస్థితులపై ఆందోళనల మధ్య డాలర్లకు డిమాండ్‌ పెరిగిందని ఫారెక్స్‌ ట్రేడర్లు చెప్తున్నారు. ఉదయం ఆరంభంలోనే 76.75 స్థాయికి పడిపోయి ప్రతికూల సంకేతాలనిచ్చిన రూపాయి.. ముగింపు సమయానికి మరింతగా నష్టపోయింది. ఒకానొక దశలో 76.68 స్థాయికి కోలుకున్నా.. తిరిగి నష్టాలు వెంటాడాయి. బుధవారం 76.44 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 13 వేలకు చేరువలో కరోనా కేసులుండగా, మృతులు 400లకుపైగా ఉన్నారు. లాక్‌డౌన్‌ పెంపు నేపథ్యంలో దేశ జీడీపీ అంచనాలు మైనస్‌ల్లోకి వెళ్లడం కూడా ఫారెక్స్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలికాలంలో రూపాయి విలువ తరచూ నష్టపోతున్నది. ఆర్బీఐ రంగంలోకి దిగినా.. దేశ, విదేశీ పరిస్థితుల ప్రభావంతో కోలుకోలేకపోతున్నది. ఇది ఆందోళనకర పరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు.


logo