Business
- Jan 01, 2021 , 02:32:47
VIDEOS
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భెల్‌కు రూ.3,200 కోట్ల ఆర్డర్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని హైడ్రో ప్రాజెక్టుల కోసం రూ.3,200 కోట్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు గురువారం ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) తెలియజేసింది. తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం 1,992 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 15 పంప్-మోటర్ సెట్లను, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (ప్యాకేజీ 1&16) కోసం 1,885 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 13 పంప్-మోటర్ సెట్లను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (ప్యాకేజీ 5&8) మరో 18 పంప్-మోటర్ సెట్ల ఆర్డర్‌ను కూడా భెల్ చూస్తున్నది. ఏపీలో 12x80 మెగావాట్ల పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం కప్లాన్ హైడ్రో టర్బైన్లను తయారుచేసి సరఫరా చేస్తున్నామని భెల్ వివరించింది.
తాజావార్తలు
MOST READ
TRENDING