శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 06, 2021 , 01:31:28

రూ.193 లక్షల కోట్లు

రూ.193 లక్షల కోట్లు

బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల విలువ 

సరికొత్త గరిష్ఠ స్థాయికి సూచీలు

న్యూఢిల్లీ, జనవరి 5: దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. వరుసగా పదో రోజు సూచీలు సరికొత్త గరిష్ఠ స్థాయిని తాకాయి. దీంతో మదుపరుల సంపద రికార్డు స్థాయికి దూసుకుపోయింది. బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్‌ విలువ రూ.192.87 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇంతటి గరిష్ఠ స్థాయిని తాకడం స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి. గడిచిన పది రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2,883. 82 పాయింట్లు లేదా 6.33 శాతం లాభపడి 48,437.78 పాయింట్లకు ఎగబాకింది. దీంతో బీఎస్‌ఈ లిైస్టెన సంస్థల విలువ మరో రూ.14,08,195. 89 కోట్లు ఎగబాకి రూ.1,92,87,518. 94 కోట్లు(2.6 ట్రిలియన్‌ డాలర్లు) చేరుకున్నది. కరోనా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతుండటం మార్కెట్లకు మరింత జోష్‌నిచ్చింది. భారత్‌ బయోటెక్‌, సిరమ్‌ ఇనిస్టిట్యూట్‌లు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటన సూచీలు పెరుగుదలకు ప్రధాన కారణం. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యంత విలువైన సంస్థగా కొనసాగుతున్నది. ప్రస్తుతం సంస్థ విలువ రూ.12,46,334.05 కోట్లు. ఆ తర్వాతి స్థానంలో రూ.11,60,349.92 కోట్లతో టీసీఎస్‌ ఉన్నది.  

ఆర్థిక, ఐటీ  దన్నుతో..

ఆర్థిక, ఐటీ రంగ షేర్ల నుంచి వచ్చిన దన్నుతో దేశీయసూచీలు వరుసగా పదో రోజు లాభాల్లో ముగిశాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీ రూపాయి, గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో లాభాల్లోకి మళ్లింది. చివరకు 260.98 పాయింట్ల లాభంతో 48,437.78 పాయింట్ల వద్ద ముగిసింది 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 66.60 పాయింట్లు అందుకొని 14,199.50 వద్ద స్థిరపడింది. 6.31 శాతం పెరిగిన యాక్సిస్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంకులు లాభపడగా..ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు నష్టపోయాయి. 


VIDEOS

logo