సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 02:41:01

మూడు బీమా సంస్థలకు రూ.12 వేల కోట్లు

మూడు బీమా సంస్థలకు రూ.12 వేల కోట్లు

న్యూఢిల్లీ, జూలై 8:  ప్రభుత్వ రంగ బీమా సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు బీమా సంస్థలకోసం రూ.12,450 కోట్ల నిధుల కేటాయింపునకు బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నది. వీటిలో నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.7,500 కోట్లు, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెరో రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు క్యాబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. దీంతో ఈ సంస్థల విలీనం మరోమారు వాయిదా పడినట్లు అయింది.  గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.2,500 కోట్లు కలుపుకొని రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. logo