శనివారం 30 మే 2020
Business - May 10, 2020 , 00:15:02

హ్యుందాయ్‌ ప్లాంట్‌ నుంచి తొలిరోజే 200 కార్లు

హ్యుందాయ్‌ ప్లాంట్‌ నుంచి తొలిరోజే 200 కార్లు

  • మళ్లీ లావా మొబైళ్ల తయారీ l నేడు 50 స్టోర్లను తెరువనున్న తనిష్క్‌

న్యూఢిల్లీ/బెంగళూరు, మే 9: లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు సడలించడంతో దేశంలో వివిధ రకాల పరిశ్రమలు, వ్యాపార కార్యాలయాలు దశలవారీగా మళ్లీ తెరుచుకొంటున్నాయి. చెన్నై సమీపంలోని తమ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని పునఃప్రారంభించిన తొలిరోజే 200 కార్లు బయటకు వచ్చాయని ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హ్యుందాయ్‌ శనివారం వెల్లడించింది. శ్రీపెరంబుదూర్‌ గల ఈ ప్లాంట్‌లో ఈ నెల 8 నుంచి కార్ల తయారీ మొదలైంది. ఇదేవిధంగా నోయిడాలోని తమ తయారీ కేంద్రంలో 20 శాతం సామర్థ్యంతో శనివారం నుంచి ఉత్పత్తిని పునఃప్రారంభించినట్టు దేశీయ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ లావా వెల్లడించింది. మరోవైపు టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల తయారీ సంస్థ తనిష్క్‌ ఆదివారం 50 స్టోర్లను తెరువనున్నట్టు ప్రకటించింది.


logo