బుధవారం 27 మే 2020
Business - May 22, 2020 , 18:46:14

24 శాతం వాటా కొనుగోలుపై IRSDCతో రైట్స్‌ ఒప్పందం

24 శాతం వాటా కొనుగోలుపై IRSDCతో రైట్స్‌ ఒప్పందం

న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (IRSDC)తో భారత్‌కే చెందిన రైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం IRSDCలో రైట్స్‌ సంస్థ 24 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ కీలక ఒప్పందంపై సంతకం కూడా చేసినట్లు రైట్స్‌ సంస్థ శుక్రవారం వెల్లడించింది. IRSDC అనేది దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో పునరుద్ధరణ పునరుద్ధరణ పనులు చేపట్టే ఒక కంపెనీ. 

లాక్‌డౌన్‌ సమయంలో తాము పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని, అందులో IRSDCతో జరిగిన ఒప్పందంతోపాటు ఆఫ్రికాకు ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు కీలకమైనవని రైట్స్‌ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ మల్హోత్రా తెలిపారు. ఇప్పడు లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు కూడా ఇవ్వడంతో ఇక తమ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని ఆయన చెప్పారు. కాగా, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగానే ఇలాంటి ఒప్పందాలు కుదురుతున్నాయని ప్రచారం జరుగుతున్నది.


logo