శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 27, 2020 , 19:52:13

రూ .14.5 లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ మార్కెట్ క్యాప్

రూ .14.5 లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ మార్కెట్ క్యాప్

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక మైలురాళ్లను సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) స్టాక్ మరింత పైకి పయనిస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలోని ఐదో ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ సంస్థ బీఎస్ఈలో జాబితా చేయబడిన అన్ని కంపెనీలలో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో 10% గా ఉంది. గత రెండేండ్లుగా ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రెట్టింపు అవుతున్నది.

రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.54.58 లక్షల కోట్లు. దీనితో బీఎస్‌ఈ-లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌లో రూ.147.23 లక్షల కోట్ల విలువైన రిలయన్స్ వాటా 9.9%. 2020 ప్రారంభం నుండి దీని మార్కెట్ క్యాప్ దాదాపు 50 శాతం పెరిగి రూ .4.77 లక్షల కోట్లకు చేరుకుంది. 2019 డిసెంబర్ 31 న ఇది రూ.9.59 లక్షల కోట్లుగా ఉన్నది. అదే కాలంలో, ఎస్ & పీ బీఎస్ఈ సెన్సెక్స్ 7.7 శాతం తగ్గింది. బ్లూ-చిప్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ 5.3 శాతం పడిపోయింది.

రిలయన్స్ గత వారం ప్రపంచంలోని అత్యంత విలువైన 50 కంపెనీలలో స్థానం సంపాదించినప్పుడు మరో పురస్కారాన్ని సాధించినట్లయింది. సంస్థ తన జియో ప్లాట్‌ఫామ్‌లలో మార్క్యూ ఇన్వెస్టర్లు, టెక్ టైటాన్స్‌లైన ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబడాలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కాటర్టన్, పీఐఎఫ్, ఇంటెల్ సంస్థలు సమిష్టిగా రూ.1.22 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టారు. 


logo